రాజమౌళి మామూలోడు కాదుగా.!
- May 11, 2024
‘బాహుబలి’ సినిమాతో ఇప్పటికే ప్రపంచం దృష్టిలో పడిపోయాడు జక్కన్న రాజమౌళి. అయితే ఇంకా చాలదంట. ఇంటర్నేషనల్ స్థాయిలో రాజమౌళి తన గుర్తింపు చాటుకోవాలనుకుంటున్నాడు.
ఆ దిశగానే ఈ ప్రయత్నాలన్నీ అంటూ తాను చేస్తున్న సినిమాలు, వాటి తాలూకు హిస్టరీలు నెమరు వేసుకున్నాడు.
తాజా విషయమేంటంటే ‘బాహుబలి’ సినిమాకి మూడో పార్ట్ కూడా తెరకెక్కించే పనిలో వున్నాడట రాజమౌళి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతే ఆ సీక్వెల్ ప్లాన్ చేశాడట కానీ, ప్రబాస్ బిజీగా వుండడంతో ఆ ప్రయత్నం పక్కన పెట్టి మహేష్ సినిమాని లైన్లో పెట్టాడట.
మహేష్ బాబు సినిమాని ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించి ఇంటర్నేషనల్ స్టాయిలో గుర్తింపు దక్కించుకోవాలనుకుంటున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఆస్కార్ రేసులో వుంచడంతోనే రాజమౌళి తన కలను చాలా వరకూ సాకారం చేసుకున్నాడు.
కాగా, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’ కూడా త్వరలోనే ఓ కొలిక్కి రానుందట. అంతేకాదు, లార్జ్ స్కేల్లో ఓ బిగ్ యానిమేషన్ మూవీ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. ఆల్రెడీ ‘బాహుబలి’కి యానిమేషన్ వెర్షన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గా వచ్చిన ఈ వెర్షన్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..