రష్మిక మండన్నా ఎన్నాళ్లకెన్నాళ్లకు.!
- May 11, 2024
నేషనల్ క్రష్ రష్మిక మండన్నా అంటే యూత్‌లో ఆ క్రేజే వేరు. అయితే, ప్రస్తుతం రష్మిక మండన్నా కాస్త సైలెంట్‌గా వుంది. అలాగని కెరీర్ డల్ అయ్యిందని కాదండోయ్.
అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది రష్మిక మండన్నా. తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటూ, క్రేజీ మూవీ ‘పుష్ప 2’లోనూ రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ విషయమై రష్మిక స్పందించింది. ఈ సాంగ్ ప్రోమోకి దాదాపు 70 లక్షలకు పైగా వ్యూస్, రెండు మిలియన్లకు పైగా లైకులు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రష్మిక ఓ ట్వీట్ చేసింది. ‘అంతా పుష్ప రాజ్ మేనియా’ అని ట్వీటింది. లాంగ్ గ్యాప్ తర్వాత రష్మిక నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘ఫుష్ప’ మొదటి పార్ట్‌కి సంబంధించి కూడా పాటలు ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యాయ్. విదేశీయులు సైతం ‘పుష్ప’ పాటలపై బోలెడన్ని మీమ్స్, రీల్స్ చేస్తూ తెగ సందడి చేశారు.
ఇక, ఇప్పుడు రెండో పుష్ప రాజ్ ‘అస్సలు తగ్గేదే లే’ అంటూ తనదైన మేనరిజాన్ని మరింత డబుల్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయ్. ఇక, ఆగస్ట్ 15న రిలీజ్ కాబోయే ‘పుష్ప 2’ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేయనుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..