పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు

- May 11, 2024 , by Maagulf
పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు

యూఏఈ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ శుక్రవారం UN సభ్యునిగా ఉండాలనే పాలస్తీనియన్ బిడ్‌కు మద్దతునిచ్చింది. అన్ని అర్హతలు ఉన్నాయని, UN భద్రతా మండలి  ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని సిఫార్సు చేసింది. గత నెలలో UN భద్రతా మండలిలో యునైటెడ్ స్టేట్స్  ఆ ప్రతిపాదనను వీటో చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో సహా - 25 దేశాలు గైర్హాజరు కాగా, శుక్రవారం నాడు అసెంబ్లీలో 143 మంది అనుకూలంగా మరియు తొమ్మిది వ్యతిరేకంగా తీర్మానాన్ని ఓటు వేశారు. ఈ ఓటింగ్ పాలస్తీనియన్లకు పూర్తి UN సభ్యత్వాన్ని ఇవ్వదు. కానీ వారిని చేరడానికి అర్హులుగా మాత్రం గుర్తిస్తుంది.  మరోవైపు గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మిలిటెంట్లు హమాస్‌ల మధ్య ఏడు నెలలుగా యుద్ధం సాగుతుంది.  ఓటింగ్‌కు ముందు పాలస్తీనా ఐక్యరాజ్యసమితి రాయబారి రియాద్ మన్సూర్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ "మాకు శాంతి కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి. ఓటు అనేది పాలస్తీనా ఉనికికి ఓటు, ఇది ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. ... ఇది శాంతికి పెట్టుబడి." అని అన్నారు.   అయితే, UN సభ్యునిగా చేరడానికి దరఖాస్తును మొదట 15 మంది సభ్యుల భద్రతా మండలి,  తరువాత సాధారణ అసెంబ్లీ ఆమోదించాలి.  ఇదిలా ఉండగా, అంతర్జాతీయ సమాజం స్పందించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UN రాయబారి మొహమ్మద్ అబుషాహబ్ ఓటింగ్‌కు ముందు అసెంబ్లీకి చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com