బీట్‌రూట్ పాయసం
- June 08, 2016
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ తురుము - 1 కప్పు, క్యారెట్ తురుము - అరకప్పు, బాంబినో మాకరోనీలు - ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, గోరువెచ్చని పాలు - 2 కప్పులు, వెనీలా ఐస్‌క్రీం - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, ఏలకుల పొడి - అర టీ స్పూను, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష - 10 చొప్పున, తేనె - 4 టీ స్పూన్లు, నెయ్యి - 1 టేబుల్ స్పూను, నీరు - మూడు కప్పులు.
తయారుచేసే విధానం: నెయ్యిలో బీట్‌రూట్, క్యారెట్ తురుముల్ని పచ్చివాసన పోయేదాక సన్నని మంటపై వేగించుకోవాలి. మరో పాత్రలో 2 కప్పుల నీరుపోసి మాకరోనీలు ఉడికించాలి. ఇవి మెత్తబడ్డాక వేగించిన బీట్‌రూట్, క్యారెట్ తురుము, పంచదార, కొబ్బరి తురుము, ఏలకుల పొడి, కప్పు నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు, తేనె, వెనీలా ఐస్‌క్రీమ్ కలిపి బాదం, జీడిపప్పు, ద్రాక్షలతో అలంకరించుకోవాలి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







