ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు

- May 12, 2024 , by Maagulf
ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు

మస్కట్: ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే,  డాక్టర్ మందాకిని ఆమ్టే ఇటీవల ఒమన్‌ను సందర్శించారు.  భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన వీరు సాంఘిక సంక్షేమం మరియు సమాజ సేవకు అసాధారణ సేవలను అందించారు. విదర్భ ప్రాంతానికి చెందిన ఈ జంట సలాలా మరియు మస్కట్‌లకు సందర్శించారు. డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అతని భార్య, డాక్టర్ మందాకిని ఆమ్టేతో కలిసి 2008లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మరియు మధ్యప్రదేశ్‌లోని మాడియా గోండులకు లోక్ బిరాదారి ప్రకల్ప్ ద్వారా చేసిన సహకార ప్రయత్నాలకు ఈ గుర్తింపు లభించింది. ఒమన్‌లో పర్యటనలో ఆమ్టే దంపతులు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇండియన్ కమ్యూనిటీని ఆలోచింపజేసాయి. భారతీయ రాయబార కార్యాలయంలో భారత రాయబారి అమిత్ నారంగ్‌తో వారు సమావేశమయ్యారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com