విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- May 12, 2024
బహ్రెయిన్: అవసరమైన అనుమతులు లేకుండా విదేశీ కార్మికులను నియమించుకున్న ఒక రెస్టారెంట్ యజమానికి భారీ జరిమానాలను విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక క్రిమినల్ ఉత్తర్వును జారీ చేసింది. చట్టం ప్రకారం, ప్రతి అనధికార కార్మికుడికి రెస్టారెంట్ యజమానికి BD1,000 జరిమానా విధించింది. ప్రతి ఒక్కరు BD100 జరిమానాలు, వారి శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరణకు గురవుతారు. లేబర్ ఇన్స్పెక్టర్లు సాధారణ తనిఖీ సమయంలో రెస్టారెంట్లలో విదేశీ కార్మికులను గుర్తించినట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే, యజమాని మరియు కార్మికులలో ఒకరు కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో జరిమానాలను సవాలు చేసారు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. అంతటితో ఆగని వారు అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినట్లు తీర్మానించి తీర్పును సమర్థించారు. అనంతరం కాసేషన్ కోర్టుకు వెళ్లారు. కాగా,అప్పీల్‌ను తిరస్కరించిన న్యాయమూర్తులు సరైన వర్క్ పర్మిట్లను అందించడంలో యజమాని విఫలమయ్యారని అభిప్రాయడి జరిమానాను విధించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!