సిలికాన్ వ్యాలీలో ఎన్నారైలతో కేటీఆర్ సమావేశం..
- June 08, 2016
తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలోని వివిధ రంగాల్లో విజయవంతమైన తెలంగాణ ఎన్నారైల సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి చాలా మంది కొన్ని దశాబ్దాల కిందటే అమెరికాలో ఉద్యోగాలు ప్రారంభించి, వివిధ కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. మరికొంత మంది సొంత కంపెనీలు నెలకొల్పారని, ఇంకొందరు వెంచర్ క్యాపిటలిస్టుగా రాణిస్తున్నారన్నారు. ఇలా వివిధ రంగాల్లో విజయవంతమైన ఎన్నారైలతో మంత్రి సిలికాన్ వ్యాలీలో సమావేశమయ్యారు.మెదక్ జిల్లా నుంచి అమెరికాలో స్థిరపడిన ఓం నల్లమాసు కీలక పాత్ర పోషిస్తున్న అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజురెడ్డి, రాంరెడ్డి, కిట్టు కొల్లూరి వంటి వెంచర్ క్యాపిటలిస్టులు, వివిధ కంపెనీల్లో టాప్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న 40 మంది తెలంగాణ ఎన్నారైలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యంగా పారిశ్రామిక విధానం, టీ-హబ్, ఐటీ పాలసీ వంటి అంశాలను వివరించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వారి నుంచి కోరుకుంటున్న సహాయ సహకారాలను తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్న టీ-హబ్ అవుట్ పోస్టు ఆలోచనను వారితో పంచుకున్నారు. ఈ ఆలోచనను అభినందించిన ఎన్నారైలు.. అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అవుట్ పోస్టు ఏర్పాటు, అందులో స్టార్టప్‌ల ఎంపిక, వాటికి సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్టులతో ఆర్థిక సహకారం వంటి అంశాల్లో పూర్తి సహకారం ఇస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అత్యుత్తమైందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను అమెరికాలోని కంపెనీలకు తెలపాలని మంత్రి కోరారు. రాజకీయ స్థిరత్వం, సమర్థవంతమైన పాలన, పారదర్శక విధానాలున్న కొత్త రాష్ట్రాన్ని కంపెనీలకు పరిచయం చేయాలన్నారు. ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపకల్పన చేస్తోందని, తన పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే సీఎంతో చర్చించి పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి







