Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- May 13, 2024
యూఏఈ: ఏకీకృత GCC టూరిస్ట్ వీసా ప్రారంభానికి ముందు గల్ఫ్ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల కోసం లోకల్ మరియు గ్లోబల్ ట్రావెల్ ఏజెన్సీలు త్వరలో ప్యాకేజీలను విడుదల చేయనున్నారు. టూరిస్టు ప్యాకేజీలు సందర్శకులకు Dh4,000-Dh5,000 అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతాయని, మూడు దేశాలలో ప్రయాణం, హోటల్ మరియు సందర్శనా స్థలాలను కవర్ చేయవచ్చని ట్రావెల్ అధికారులు చెబుతున్నారు. గత వారం అరేబియా ట్రావెల్ మార్కెట్‌లో జరిగిన మంత్రివర్గ చర్చ సందర్భంగా, ఈ ఏడాది చివరి నాటికి 'జిసిసి గ్రాండ్ టూర్స్' వీసాను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీసా స్కెంజెన్-శైలి వీసా మాదిరిగానే ఉంటుందని, వీసా హోల్డర్లు మొత్తం ఆరు గల్ఫ్ దేశాలలో పర్యటించేందుకు వీలు కల్పిస్తుందని ఎక్స్‌పీడియాలో గ్లోబల్ మార్కెట్ల వైస్ ప్రెసిడెంట్ రెహాన్ అసద్ అన్నారు. యూఏఈ, ఖతార్ మరియు సౌదీ అరేబియాలో రెండు రోజులు పర్యటించేందుకు సుమారుగా Dh4,000-Dh5,000 ఖర్చవుతుందని, ఎంపిక చేసిన దేశాలలో విమానాలు, హోటళ్లు, విహారయాత్రలు ఇందులో కవర్ అవుతాయన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!