వాట్సాప్ లో ఇకపై జిఫ్ ఇమేజ్ ఫైల్స్..
- June 08, 2016
ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను యాడ్ చేసుకుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ లో ఇకపై జిఫ్ ఇమేజ్ ఫైల్స్ కూడా ప్లే చేయవచ్చు. ఇది ఇప్పటికే ఐఫోన్లలో అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఐఫోన్ మినహా ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.ఇప్పటిదాకా జిఫ్ ఫైల్స్ ను వాట్సాప్ సపోర్ట్ చేయలేదు. ఇకపై దీన్ని కూడా ఆండ్రాయిడ్ యూజర్స్ షేర్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ ఇమేజ్ ఉండే జిఫ్ ఫైల్స్ కోసం సరికొత్తగా బీటా రిలీజ్ (వీ2.167.1)ను వాట్సాప్ అభివృద్ధి చేసినట్లు సమాచారం.అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. కాగా, వైబర్లో జిఫ్ ఫైల్స్ ను ప్లే చేసుకునే అవకాశం ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ







