దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- May 14, 2024
యూఏఈ: అధికారులు దొమలను నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. దొమల సంతానోత్పత్తి ప్రదేశాలను నివేదించమని నివాసితులను వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) కోరింది. ఇటీవల దొమల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వ శాఖలోని మునిసిపల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఒతైబా సయీద్ అల్ ఖైదీ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు దీనికి కారణం అన్నారు. ఇటీవల వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు చేరిందన్నారు. చెరువులు, నీటి కుంటలు లేదా సరిగా ఎండిపోయిన పూల కుండీలు వంటి నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారవచ్చని హెచ్చరించారు. నివాసితులు 8003050కి డయల్ చేసి కొంత కాలంగా పట్టించుకోకుండా నిలిచిపోయిన నీరు ఉన్న ప్రాంతాల గురించి తెలియజేయాలని కోరారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా తెలపాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి మంత్రిత్వ శాఖ GIS మ్యాపింగ్, సెన్సార్లు, ప్రిడిక్టివ్ మోడలింగ్ మరియు బిగ్ డేటా అనలిటిక్స్‌ని ఉపయోగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!