‘సలార్ 2’ లో కూడా ప్రబాస్ పరిస్థితి అంతేనా.?

- May 14, 2024 , by Maagulf
‘సలార్ 2’ లో కూడా ప్రబాస్ పరిస్థితి అంతేనా.?

ప్రబాస్ నటించిన సినిమాలేమీ ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు. అలాంటిది ‘సలార్’ సినిమా కాస్త ఊపిచ్చింది. ప్రబాస్‌పై ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు సినిమాని హిట్ రేస్‌లో వుంచాయని చెప్పొచ్చేమో.

అయితే, ఈ సినిమా కోసం ప్రబాస్ కష్టపడిందేమీ లేదని తాజాగా తెలిసింది. మరీ చిత్రమైన అంశమేంటంటే, సినిమాకి హీరో అంటే సినిమాలో ముప్పావు వంతు హీరోనే కనిపిస్తుండాలి. వినిపిస్తుండాలి. అలాంటిది ‘సలార్ 1’లో ప్రబాస్ కనిపించింది కేవలం మూడు నిమిషాలేనట. మాట్లాడింది 2.33 నిమిషాలని తేల్చారు.

ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ప్రశాంత్ నీల్‌ని ఆడిపోసుకుంటున్నారు. రెండో పార్ట్‌లో కూడా ప్రబాస్‌ని అలాగే చూపిస్తాడా.? డైలాగులు అలాగే రాస్తాడా.? అని క్వశ్చన్ చేస్తున్నారు.

కానీ, ఇది నిజంగా దారుణం. ఇకపోతే, ‘సలార్ 2’ని శౌర్యంగ పర్వం అనే కాన్సెప్ట్‌తో సిద్దం చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ పర్వంలో ప్రబాస్ పాత్ర, పాత్ర తాలూకు ప్రాధాన్యత మొదటి పార్ట్‌కి మించి వుంటేనే ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు శాటిస్‌ఫై అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి, ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com