ఎన్టీయార్ బర్త్‌డే గిఫ్ట్.! రెడీనా.?

- May 15, 2024 , by Maagulf
ఎన్టీయార్ బర్త్‌డే గిఫ్ట్.! రెడీనా.?

మే 20న జూనియర్ ఎన్టీయార్ బర్త్ డే వేడుకలు అభిమానులు ఎప్పుడూ ఘనంగానే జరుపుకుంటుంటారు. ఈ సారి ఆయన గ్లోబల్ స్టార్. సో ఆ ఉత్సాహంతో మరింత ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్లు చేసేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అలాగే, ఎన్టీయార్ నటించబోయే సినిమా ‘దేవర’ నుంచి కూడా ఓ స్పెషల్ అప్టేట్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ‘దేవర’ అండ్ టీమ్ కూడా జాగ్రత్త పడుతోందట.

అందులో భాగంగానే ఓ సాంగ్ ప్రోమో కానీ, లేదంటే టీజర్‌లా కానీ సంతృప్తకరమైన అప్డేట్ ఒకటి వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు కూడా మొదలెట్టేశారట ‘దేవర’ అండ్ టీమ్. జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.

రాబోయే ఈ అప్డేట్‌లో జాన్వీ కపూర్ నుంచి కూడా మాంచి మసాలా వుండబోతోందని తెలుస్తోంది. అలాగే, ఎన్టీయార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ అప్టేట్ వుండనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. లెట్స్ వెయిట్ ఫర్ దట్ క్రేజీ అప్డేట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com