‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’.! మాస్ కా దాస్ హంగామా ఈ సారి మామూలుగా వుండదు.!

- May 16, 2024 , by Maagulf
‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’.! మాస్ కా దాస్ హంగామా ఈ సారి మామూలుగా వుండదు.!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ సారి ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ సినిమాతో రాబోతున్నాడు. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ నెల 31న రిలీజ్ కాబోతోంది. కాగా, ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్‌గా వచ్చిన ‘గామి’ చిత్రం ఓ మోస్తరు విజయం అందుకుంది విశ్వక్ సేన్‌కి.

అయితే, ‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ చిత్రానికి సంబంధించి ప్రోమోస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. ట్రైలర్‌కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ చాలా నమ్మకంగా వున్నాడు.

‘ఈ సారి ఒక్కొక్కరికీ శివాలెత్తిపోద్ది..’ అంటూ తనదైన స్టైల్‌లో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఈ సినిమాలో ‘డీజె టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి, విశ్వక్ సేన్ నమ్మకం ఎంత మేర నిజమవుతుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com