రెండో ‘దాక్షాయణి’ అస్సలు తగ్గేదేలే.!

- May 16, 2024 , by Maagulf
రెండో ‘దాక్షాయణి’ అస్సలు తగ్గేదేలే.!

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయ్.

మొన్నా మధ్య రిలీజ్ చేసిన ‘పుష్ప 2’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పాత్రకి సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. మొదటి పార్ట్‌లో దాక్షాయణి పాత్రలో కనిపించింది అనసూయ భరద్వాజ్.

ఈ పార్ట్‌లోనూ అదే పాత్ర కంటిన్యూ అవుతోంది. భర్తని కూడా చంపేసే క్రూరమైన రోల్‌లో కనిపించింది అనసూయ. ఈ సారి అంతకు మించి అనేలా ఆ పాత్ర వుండబోతోందని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లుక్‌పై అనసూయ ఆటిట్యూడ్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్‌గా అనసూయ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప 2’ టీమ్ ఈ లుక్ రిలీజ్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com