పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- May 17, 2024
మనామా: సౌదీ అరేబియా పాలస్తీనా రాజ్య స్థాపనకు మరియు ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యునిగా అంతర్జాతీయ గుర్తింపుకు మద్దతు ఇస్తుందని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించారు. గురువారం మనామాలో అరబ్ లీగ్ సమ్మిట్ ప్రారంభ సెషన్లో ప్రసంగించిన క్రౌన్ ప్రిన్స్.. కాల్పుల విరమణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని, గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అరబ్ లీగ్ కౌన్సిల్ యొక్క శిఖరాగ్ర స్థాయిలో 33వ సెషన్లో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తన ప్రసంగంలో, అరబ్ సమస్యలపై ముఖ్యంగా పాలస్తీనా సమస్యపై తమ దేశ వైఖరిని వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణ గురించి చర్చించడానికి నవంబర్ 2023లో రియాద్‌లో సౌదీ అరేబియా అసాధారణ అరబ్, ఇస్లామిక్ సమ్మిట్‌ను నిర్వహించడాన్ని ప్రస్తావించారు. సౌదీ అరేబియా ఏ కారణంతోనైనా గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిందని, గాజాలోని మానవతా పరిస్థితులను పరిష్కరించే ప్రయత్నాలకు రియాద్ మద్దతు ఇచ్చిందన్నారు. అదే విధంగా ఎర్ర సముద్ర ప్రాంతం యొక్క భద్రతను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. సముద్ర నావిగేషన్ యొక్క భద్రతను ప్రభావితం చేసే ఏవైనా చర్యలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతియుత మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని రాజ్యం పిలుపునిస్తుందని ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!