కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి

- May 18, 2024 , by Maagulf
కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి

తిరువనంతపురం: కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దీనిబారిన పడ్డవారి సంఖ్య 2 వేలు దాటింది. ఇప్పటి వరకు హెపటైటిస్ తో మొత్తం 12 మంది చనిపోయారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్‌, త్రిసూర్‌లలో ఈ కేసులు పెరుగుతున్నాయి. కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి సూచించింది.

హెపటైటిస్ ఏ అంటే..
వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. ఇన్ ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని చెప్పారు. ఆ సందర్భంలో కాలేయ మార్పిడి అవసరమవుతుందని వివరించారు. కొంతమంది బాధితుల్లో హెపటైటిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని, వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. మరికొంతమందిలో మాత్రం వ్యాధి తీవ్రమై మరణం సంభవిస్తుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com