బరువు తగ్గుతేనే ఉద్యోగాలు : ఎయిర్ ఇండియా
- June 09, 2016
బరువు పెరగడం ఆరోగ్యానికే కాదు.. ఉద్యోగానికీ ప్రమాదంగా మారింది. ఎందుకంటే ఎయిర్ఇండియా (ఏఐ) లావుగా ఉన్న వారికి ఆర్నెళ్లు సమయం ఇచ్చి సన్నబడమని చెప్తోంది. లేదంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తుందట. ఎయిర్ఇండియా ఇప్పటికే వంద మంది అధిక బరువున్న సిబ్బందిని గుర్తించింది. వారికి కఠిన నిబంధనలు పెట్టింది. ఆర్నెళ్లలో బరువు తగ్గుతేనే ఉద్యోగాలు ఉంటాయని మంగళవారం ఏఐ సీనియర్ మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు. క్యాబిన్ సిబ్బంది బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) మహిళల్లో అయితే 27, పురుషుల్లో అయితే 30 కంటే ఎక్కువ ఉన్న వారు తగ్గకపోతే విమానాల్లోకి అనుమతించమని తేల్చి చెప్పింది.మహిళలు బీఎంఐ 25 నుంచి 27లోపు, పురుషులు 27 నుంచి 30లోపు ఉండాలని ఏఐ పేర్కొంది. ఎయిర్ఇండియా సిబ్బందిలోని 2,800 మందిలో దాదాపు 150 మంది వూబకాయులు ఉన్నట్లు ఏఐ వెల్లడించింది. గత ఏడాది కూడా ఏఐ 130 మంది సిబ్బందిని అధిక బరువు కారణంగా తొలగించింది. వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కానీ సిబ్బంది కొరత కారణంగా 15రోజుల్లో మళ్లీ వారిని తీసుకున్నారు. 2014లో అధిక బరువు కారణంగా తొలగించిన ముగ్గురు ఏఐ సిబ్బంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు ఏఐ బరువు తగ్గడానికి ఆర్నెళ్ల సమయం ఇస్తోంది. లేదంటే తొలగిస్తామని ఖరాఖండీగా చెప్పేస్తోంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







