గౌతమిపుత్ర...' ఫస్ట్‌లుక్‌ను విడుదల ...
- June 09, 2016
పౌరాణిక చిత్రాలంటే తెలుగువారికి టక్కున గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. ఆయన నట వారసుడిగా తనకంటూ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. విభిన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే బాలకృష్ణ.. తన సినీ ప్రయాణంలో కథానాయకుడిగా 100వ మైలురాయి చేరుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. శుక్రవారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం 'గౌతమిపుత్ర...' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.ఇందులో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఆయన సరసన శ్రియను చిత్ర బృందం ఇటీవలే ఎంపిక చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. పోస్టర్‌పై హ్యాపీబర్త్‌డే 'బసవతారకరామపుత్ర బాలకృష్ణ' అంటూ యూనిట్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







