పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకున్నాడా.? లేదా.?
- May 19, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో టేక్ లైట్ అనుకున్నా, ఈ టీజర్‌కి మంచి వ్యూస్ రావడంతో ఒకింత అంచనాలు పెరిగాయ్.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలి పూరీ జగన్నాధ్. అప్పుడే తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకోగలడు. అందుకే ఈ సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడట పూరీ. కొందరు సో సో గా వుందంతే అని అంటుంటే, ఇంకొందరు ఏది ఏమైనా పూరీ అంటే పూరీనే ఏదో మ్యాజిక్ వుంటుంది ఆయన సినిమాలో.. అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకొచ్చి ప్రతినాయకుడి పాత్ర మెయిన్ అస్సెట్ కానుందని చెప్పొచ్చేమో. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు టీజర్లో ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్లో వున్నాయ్.
విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా వుంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. సంజయ్ దత్ లాంటి విలన్ని డబుల్ ధిమాక్ వున్న శంకర్ పాత్ర ఎలా తట్టుకోగలదు.? ఆ సిట్యువేషన్‌ని డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ ఎలా డీల్ చేశాడు.? అనేదే ‘డబుల్ ఇస్మార్ట్’ కథ. చూడాలి మరి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!