‘భారతీయుడు’ రెండో ముచ్చటే ఇలా వుంటే, మూడోది కూడానా.?

- May 20, 2024 , by Maagulf
‘భారతీయుడు’ రెండో ముచ్చటే ఇలా వుంటే, మూడోది కూడానా.?

‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో, అప్పుడెప్పుడో వచ్చిన సంచలన సినిమా ‘భారతీయుడు’కి సీక్వెల్ రూపొందించాలని కమల్ అండ్ టీమ్ కంకణం కట్టుకున్నారు.

ఆ దిశగానే బూజు పట్టి పక్కన పడి వున్న ‘ఇండియన్ 2’ స్ర్కిప్టు దులిపి బయటికి తీశారు. వేగంగానే షూటింగ్ పూర్తి చేస్తూ వచ్చారు. ఇక రేపో మాపో రిలీజ్‌కి సిద్ధమైంది కూడా సినిమా.

రిలీజ్ డేట్ విషయమై కాస్త మల్లగుల్లాలు పడుతున్నారు కానీ, మొత్తానికి త్వరలో ఈ సినిమా రిలీజ్ అయితే వుంటుందనేది పక్కా. ఈ లోపే స్వయంగా కమల్ హాసన్ నుంచి ఓ అప్డేట్. అదేంటంటే, ‘ఇండియన్ 3’ కూడా రాబోతోందట.

అది కూడా ఎక్కువ రోజులు టైమ్ తీసుకోకుండా రెండో పార్ట్ రిలీజైన ఆరు నెలలకే మూడో పార్ట్ రిలీజ్ చేయబోతున్నారట. ఇది జస్ట్ గాసిప్ కాదండోయ్. స్వయంగా కమల్ హాసనే క్లారిటీ ఇచ్చారు. ఇన్నేళ్లుగా ఇండియన్ 2’ పై కసరత్తులు చేస్తుంటే కంప్లీట్ కాని సినిమా.. మూడో పార్ట్ కోసం కేవలం ఆరు నెలలు టైమ్ సరిపోతుందా.? అనే అనుమానాలు రావచ్చు.

అయితే, రెండో పార్ట్‌తో పాటే మూడో పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతోందట. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా కమల్ ఈ సీక్రెట్ రివీల్ చేసేశారట. అదీ సంగతి. ఒకవేళ అదే జరిగితే కమల్ అభిమానులకి అంతకన్నా పెద్ద పండగ ఇంకేముంటుంది. అదీ చూద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com