ప్రబాస్ నిజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడా.?
- May 20, 2024
పబ్లిసిటీకి చాలా దూరంగా వుంటుంటాడు ప్రబాస్. ‘బాహుబలి’ సినిమాతో ఆయన కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలు దాటేశాయ్ కానీ, ఆయన దాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు కూడా.
ప్రమోషన్లలో ఎక్కడా పెద్దగా కనిపించడు ప్రబాస్. ‘బాహుబలి’ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు ఫ్లాప్ అనే చెప్పాలి కానీ, ఆ ఫెయిల్యూర్సేమీ ప్రబాస్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయలేకపోయాయ్.
ఇప్పుడు ‘కల్కి’ సినిమాతో ప్రబాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. అందుకు టైమ్ కూడా పెద్దగా లేదనే చెప్పాలి. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్‌లో చేస్తుండాలి. కానీ, ప్రబాస్ తరపున అలాంటివేమీ జరుగుతాయని ఆశించక్కర్లేదు.
అయితే, ప్రబాస్‌లో ఒకింత మార్పు కనిపిస్తోంది ఈ మధ్య. సోషల్ మీడియాలో ఆయన తనదైన స్టైల్‌లో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ‘కల్కి’ సినిమాకి సంబంధించి ప్రబాస్ ప్రత్యేకమైన ప్రమోషన్లు చేస్తున్నారు.
లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘బుజ్జి’ అనే ఓ అప్‌డేట్ బయటికొచ్చింది. ఇది ఈ సినిమాలో ప్రబాస్ నడపబోయే కారు పేరుగా చెబుతున్నారు. దీన్ని రివీల్ చేసే క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రబాస్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇకపై కూడా ప్రబాస్ నుంచి ఇలాంటి బోలెడన్ని స్పెషల్ పోస్టులు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని ఆయన సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!