కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- May 22, 2024
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటిని పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్రం, కల్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోలని భావిస్తున్నామని, ఈ మేరకు త్వరలోనే ఏపీ సీఎంను కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రచన అతిథి గృహానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..