ఫ్లెమింగోలను ఢీకొట్టి దెబ్బతిన్న ఎమిరేట్స్ విమానం..!
- May 23, 2024
యూఏఈ: దుబాయ్-ముంబై ఎమిరేట్స్ విమానం టచ్‌డౌన్‌కు కొద్దిసేపటి ముందు ఫ్లెమింగోల గుంపులోకి వెళ్లి దెబ్బతున్నదని ఎయిర్‌లైన్ ప్రతినిధి బుధవారం తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు మరియు సిబ్బంది సురక్షితంగా దిగారని ప్రతినిధి ధృవీకరించారు. కాగా ఈ ఘటనలో విమానం దెబ్బతిందని, దీని ఫలితంగా మే 20న దుబాయ్‌కి బయలుదేరాల్సిన రిటర్న్ ఫ్లైట్ EK509 రద్దు అయిందని, ఈ సంఘటన సోమవారం జరిగిందని ప్రతినిధి తెలిపారు. ఈ విషయంలో భారత అధికారులతో సహకరిస్తోందని ఎమిరేట్స్ తెలిపింది. ఫ్లైట్ EK509 యొక్క ప్రయాణీకులు మరియు సిబ్బందికి రాత్రిపూట వసతి కల్పించారు. ప్రయాణీకులందరికీ ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది. ఇది మంగళవారం (మే 21) రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ముంబైకి బయలుదేరింది.ఈ ఘటనలో కనీసం 36 ఫ్లెమింగోలు చనిపోయాయి అని దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







