భారీ తుఫాన్ హెచ్చరిక .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
- May 23, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని IMD వెల్లడించింది. ఇది 2 రోజుల్లో తుఫానుగా మారనుందని , దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది.
దీంతో అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారంనాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈశాన్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్‌గా మారి ఈనెల 25వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు, బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని మరికొన్ని మోడళ్ల ఆధారంగా అంచనా వేశారు. ఈనెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్‌కు ఒమన్ దేశం సూచించిన ‘రీమల్’ (REMAL) అని పేరు పెట్టనున్నారు.ఈ తూఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







