నేడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు
- May 23, 2024
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించుకుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది.ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకుని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఇవాళ రైసీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి భారత్ తరపున అధికారికంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రికి భారత్ తరపున నివాళులర్పిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







