టెహ్రాన్‌లో సంతాపం తెలిపిన సౌదీ మంత్రులు

- May 23, 2024 , by Maagulf
టెహ్రాన్‌లో సంతాపం తెలిపిన సౌదీ మంత్రులు

టెహ్రాన్: సీనియర్ ఇరాన్ అధికారులకు రెండు పవిత్ర మసీదుల సంర‌క్ష‌డు రాజు సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ త‌ర‌ఫున రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, రాష్ట్ర మంత్రి మరియు క్యాబినెట్ సభ్యుడు ప్రిన్స్ మన్సూర్ బిన్ మితేబ్ మరియు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సంతాపాన్ని తెలియ‌జేశారు. గత ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ మరియు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్ స‌హా పలువురు అధికారులు మరణించిన విష‌యం తెలిసిందే.  బుధవారం టెహ్రాన్‌లోని ప్యాలెస్ ఆఫ్ కాన్ఫరెన్స్‌లు, సమ్మిట్స్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ పొలిటికల్ అఫైర్స్ అసిస్టెంట్ మహ్మద్ జంషిదీ, విదేశాంగ మంత్రి అలీ బఘేరీ కనీతో ప్రిన్స్ మన్సూర్ బిన్ మితేబ్, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌ల తో సమావేశం సందర్భంగా సంతాపం ప్రకటించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com