చిన్న దేవరకొండ.! ప్రేక్షకుల మనసులు దోచేస్తాడా.?
- May 23, 2024
చిన్న దేవరకొండ.. అదేనండీ.! విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’ రిలీజ్కొచ్చింది. ఈ నెల 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
‘బేబీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు. ‘బేబీ’ సినిమాలో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు తనలోని హ్యూమరస్ యాంగిల్‌ని బయటపెట్టబోతున్నాడు.
కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్సాన్సే వస్తోంది. గణపతి విగ్రహం చుట్టూ జరిగే ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్టోరీగా ‘గంగంగణేశా’ అనిపిస్తోంది. కామెడీతో పాటూ, యాక్షన్.. అలాగే కొన్ని థ్రిల్లింగ్ అంశాలూ ఆకట్టుకునేలానే వున్నాయ్.
అన్నట్లు ఈ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన ప్రిన్స్ యావర్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. హాలీడేస్ సీజన్ ఎండింగ్లో వస్తున్న ‘గంగంగణేశా’ ఆనంద్ దేవరకొండకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..