విరిగిపడ్డ కొండచరియలు…100 మంది మృతి
- May 24, 2024
న్యూ గునియా: కొండచరియలు విరిగిపడి వందమంది మృతి చెందారు. ఈఘటన పాపువా న్యూ గునియాలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే వారంతా అనంతలోకాలకు వెళ్లిపోయారు.
మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..