దుబాయ్ పార్కింగ్ జోన్‌లలో EV ఛార్జింగ్ స్టేషన్‌లు

- May 25, 2024 , by Maagulf
దుబాయ్ పార్కింగ్ జోన్‌లలో EV ఛార్జింగ్ స్టేషన్‌లు

దుబాయ్‌: దుబాయ్‌లోని పెయిడ్ పార్కింగ్ జోన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) తన EV 'గ్రీన్ ఛార్జర్' స్టేషన్ల సంఖ్యను ఎమిరేట్‌లో విస్త‌రించ‌నుంది. ఈ మేర‌కు అతిపెద్ద సరఫరాదారు అయిన పార్కిన్ తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏప్రిల్ 2024 చివరి నాటికి, దుబాయ్‌లో EVల సంఖ్య 30,000కి చేరుకుంద‌ని దేవా ఎండీ సయీద్ మొహమ్మద్ అల్ తాయర్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్న‌ట్లు తెలిపారు.  దేవా దుబాయ్‌లో 197,000 పార్కింగ్ స్థలాలను నిర్వహిస్తోంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com