తెలుగు చిత్రాలతో సత్తా చాటాలనుంది: రూపాంజలి రాయ్
- May 25, 2024
హైదరాబాద్: అందం.. అభినయం..ఆకర్షణ కలబోసినట్లు సొంతం చేసుకున్న రూపాంజలి రాయ్ తనకు తెలుగు చిత్రాలంటే ఎంతో వల్లమాలిన అభిమానమని, నేడు ప్రపంచమంతా ఇష్టపడేలా తెలుగు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు. స్వతహాగా తాను బెంగాలీ, బోజ్‌పురి చిత్రాల్లో హీరోయిన్గా నటించినా తెలుగు చిత్రాలంటే అమితంగా ఇష్టపడతాన్నారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన రూపాంజలి రాయ్ ఫిలింనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో ఇష్టాగొష్టిగా మాట్లాడారు. బెంగాలీలో ప్రయాస్, ఫెరాయిమాన్, లవ్-20/20, ప్రతిభింభం, ఏహే టూ జీవన్, దర్పన్, రాతిర్ అతిథి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన రూపాంజలి రాయ్ తెలుగు చిత్రాల్లో నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. నిషా ది మిస్టరి, స్పెర్మ్ థీఫ్, గణేష్ మూర్తి, రాంగ్‌రూట్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది ఈ సుందరీమణి. రూపాంజలి రాయ్ అవార్డులు అందుకున్న చిత్రాల్లో బోల్సెల్, సాగర్ పరీర్, బ్రిత్తినా వంటివి ఉన్నాయి. కొలంబన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా, అజమాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఏషియన్ ఫీచర్ ఫిల్మ్‌గా తన చిత్రాలు నిలవడం ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. టెలివిజన్ ప్రకటనలు, జీపీఎస్ స్మార్ట్ మొబైల్ ఫోన్, దివ్యశ్రీ ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి ప్రకటనల్లో నటించిన ఈ వర్థమాన నటి ప్రత్యేకంగా డ్యాన్సుల్లో తర్ఫీదు పొందానని, డిప్లమా ఇన్ ఒడిసి, కథక్, రవీంద్ర నాట్య ఫోక్ డ్యాన్స్ వంటి డిప్లమో ఫైన్ ఆర్ట్స్‌లో ఉత్తీర్ణత సాధించిన రూపాంజలి రాయ్ భవిష్యత్తులో గొప్ప నటీమణిగా తెలుగులో రాణిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







