జిలీబ్‌లో మద్యం తయారీ యూనిట్‌ను సీజ్
- May 26, 2024
కువైట్: భద్రతా అధికారులు జిలీబ్ ప్రాంతంలో స్థానిక మద్యం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. వాటిని నడిపే నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 70 బ్యారెళ్ల మద్యం, 500 స్థానిక మద్యం బాటిళ్లను కూడా బృందం స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టు ప్రకారం, సెక్యూరిటీ పెట్రోలింగ్‌కు ఒక వ్యక్తి బ్యాగ్‌ని తీసుకెళ్లడంపై అనుమానం వచ్చింది. అతడిని విచారించిన తర్వాత అతని బ్యాగులో స్థానికంగా తయారు చేసిన మద్యం ఉన్నట్లు గస్తీ బృందం గుర్తించింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయి మద్యం తయారీ యూనిట్‌ను గుర్తించి, నిందితులందరినీ అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..