కొరియా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- May 28, 2024
యూఏఈ: అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం (మే 28) రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేరుకున్నారు.యూఏఈ మరియు కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే మార్గాలను నాయకులు చర్చిస్తారని సోషల్ మీడియా పోస్ట్‌లో షేక్ మొహమ్మద్ తెలిపారు. 2023లో కొరియాతో యూఏఈ చమురుయేతర విదేశీ వాణిజ్యం Dh19.4 బిలియన్లకు చేరుకోవడంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వివిధ రంగాల్లో పెరిగాయి. యూఏఈ దక్షిణ కొరియా యొక్క రెండవ అతిపెద్ద అరబ్ వాణిజ్య భాగస్వామి కాగా, ఆసియాలో దేశం యొక్క చమురు యేతర వాణిజ్యంలో కొరియా 10వ స్థానంలో ఉందని
షేక్ మొహమ్మద్ తెలిపారు. కొరియా పర్యటన తర్వాత, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు షేక్ మొహమ్మద్ మే 30న చైనాకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!