రెండో రంగమ్మత్తగా తెలుగమ్మాయ్ అంజలి
- May 29, 2024
సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ రోల్ రంగమ్మత్త. లెక్కల మాస్టార్ సుకుమార్ సృష్టించిన ఈ పాత్ర చాలా పాపులర్ అయ్యింది. ఈ పాత్ర పోషించిన నటి అనసూయ భరద్వాజ్‌కీ పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కింది.
ఇప్పుడు ఈ తరహా పాత్రలోనే తెలుగమ్మాయ్ అంజలి నటించబోతోంది. విశ్వక్‌సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో అంజలి ఈ పాత్ర పోషిస్తోంది.
పాత్ర పేరు తెలీదు కానీ, ట్రైలర్‌లో చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది అంజలి. హీరోకి సాన్నిహిత్యంగా వుండే పాత్ర అది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటిస్తుండగా, ఇంపార్టెంట్ పాత్రలో అంజలి నటిస్తోంది.
కాగా, గతంలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర మాదిరి ఈ పాత్ర కనిపిస్తోంది ప్రోమోస్ చూస్తుంటే. మరి, సినిమాలో ఈ పాత్ర తాలూకు ప్రాధాన్యత ఎంత మేర వుందో, అది తెలుగమ్మాయ్ అంజలి కెరీర్‌కి ఎంత యూజ్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ వారం గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదాల పర్వం తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాల మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో వుండబోతున్నాయని ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి, కొన్ని వారాలుగా చెప్పుకోదగ్గ సినిమాలు ధియేటర్లో సందడి చేయడం లేదు. మరి, విశ్వక్ సేన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!