చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను: మమ్ముట్టి
- May 29, 2024
త్రివేండ్రం: చివరి శ్వాస వరకూ తాను నటిస్తూనే ఉంటానన్నారు మమ్ముట్టి. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మరణించే చివరి క్షణం వరకు నటించినప్పటికీ తర్వాత ఎవరూ తనను గుర్తుపెట్టుకోరన్నారు.
'సినిమాలకు విరామం చెప్పే ఆలోచనలు నాకు లేవు. నేనేం అలసిపోలేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. అలా చేసినా నేను మరణించాక నన్నెంతకాలం గుర్తుపెట్టుకుంటారో చెప్పలేను. ఒక సంవత్సరం.. లేదంటే పదేళ్లు గుర్తుంచుకుంటారంతే. అది కూడా చాలా కొద్దిమంది మాత్రమే నన్ను గుర్తుచేసుకుంటారు. ప్రపంచంలో ఉన్న వేలమంది నటుల్లో నేనూ ఒకడిని. ప్రేక్షకులు నన్ను ఏడాదికి మించి స్మరించుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రపంచం ఉన్నంతవరకు అందరూ నా గురించి మాట్లాడుకోవాలనే ఆశ నాకు లేదు' అని చెప్పారు. 1971లో ఇండస్ట్రీలోకి వచ్చిన మమ్ముట్టి ఇప్పటివరకు 420 చిత్రాలకు పైగా నటించారు. మూడుసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా 'టర్బో'తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. వైశాక్ తెరకెక్కించిన మాస్ చిత్రమిది. ప్రస్తుతం మమ్ముట్టి రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









