‘సత్యభామ’ వెర్సస్ ‘మనమే’.! గెలుపెవరిదంటే.!
- May 30, 2024
చందమామ కాజల్ అగర్వాల్ సోలోగా ‘సత్యభామ’ సినిమాతో రాబోతోంది. జూన్ 7న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ఇది. ఇప్పటికే సినిమా ప్రోమోలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయ్.
పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఇవ్వబోతోందని ప్రచారం చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. అలాగే, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో కాజల్‌పై చిత్రీకరించారు. థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేయనున్నాయని యూనిట్ చెబుతోంది.
ఇదే రోజు శర్వానంద్ నటించిన ‘మనమే’ సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. లాంగ్ గ్యాప్ తర్వాత శర్వా నుంచి వస్తున్న చిత్రమిది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపైనా అంచనాలు బాగానే వున్నాయ్.
ప్రచార చిత్రాలు బ్రైట్‌గా కనిపిస్తున్నాయ్. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ‘టప్పా టప్పా..’ వెడ్డింగ్ సాంగ్ విజువల్‌గా చాలా చాలా బాగుంది. మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి. సో, చూసుకుంటే రెండూ డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడంతో పోటీ వున్నా.. కంటెంట్ బాగుందనిపిస్తే.. రెండూ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయ్ చూడాలి మరి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!