ఈ లక్షణాలుంటే థైరాయిడ్ వున్నట్లేనా.?
- May 30, 2024
ధైరాయిడ్ సోకితే ఆరోగ్య పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయ్. థైరాయిడ్ హార్మోన్లు అసమతుల్యంగా వుండడం వలల్ల శరీరంలో సడెన్‌గా కొలెస్ర్టాల్ సమస్యలు తలెత్తుతాయ్. అలాంటి సమస్యలుంటే అది ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలే అని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే థైరాయిడ్ సమస్యలున్న వారిలో అనవసరమైన డిప్రెషన్స్ మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది. హైపో థైరాయిడిజమ్ సమస్య వున్నవారిలో జ్ఞాపక శక్తి లోపం, ఏ విషయం పైనా ఏకాగ్రత లేకపోవడం.. వంటి మెదడు పని తీరుపై ప్రతికూల ప్రభావాలు తలెత్తుతాయ్.
అధికంగా జుట్టు రాలిపోవడం కూడా ధైరాయిడ్ సమస్యల్లో ఒకటి. కీళ్లు, కండరాల నొప్పులు కూడా ధైరాయిడ్ సమస్యలకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.
ధైరాయిడ్ హార్మోన్లు జీర్ణక్రియ పైనా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయ్. తద్వారా అనేక రకాల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయ్.
హైపో థైరాయిడిజమ్ వల్ల శరీరంలో రక్త పరిమాణం తగ్గుతుంది. తద్వారా గుండె కండరాలు సంకోచిస్తాయ్. గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయ్. తద్వారా గుండె పోటు సమస్య కూడా పొంచి వుంటుంది. సో, థైరాయిడ్ లక్షణాల్ని కానీ, ధైరాయిడ్ వుందని కానీ తెలిస్తే.. అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇన్ టైమ్‌లో చికిత్స చేయించుకోవడం తగు డైట్ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..