ఒమానీ-బహ్రైనీ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం
- May 31, 2024
మనామా: ఒమానీ-బహ్రెయిన్ ఉత్పత్తుల ప్రదర్శన రెండవ ఎడిషన్ మనామాలో ప్రారంభమైంది. బహ్రెయిన్ రాజ్యంలో కార్మిక శాఖ మంత్రి జమీల్ మహమ్మద్ అలీ హుమైదాన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒమన్ సుల్తానేట్‌లోని బహ్రెయిన్ రాజ్యం యొక్క రాయబార కార్యాలయం మరియు మనామాలోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో ఒమానీ-బహ్రెయిన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఇది స్వయం ఉపాధి , సామాజిక భద్రతా కుటుంబాలతో సహా 38 బహ్రెయిన్ మరియు ఒమానీ ఎగ్జిబిటర్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. బహ్రెయిన్ రాజ్యంలోని ఒమన్ సుల్తానేట్ రాయబారి సయ్యద్ ఫైసల్ హరేబ్ అల్ బుసైదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధి మరియు సామరస్యాన్ని పొందుతున్నాయని అన్నారు. ఒమన్-బహ్రెయిన్ ఉత్పత్తుల ప్రదర్శన ఒమన్ సుల్తానేట్ మరియు బహ్రెయిన్ రాజ్యం మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడానికి దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!