ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్

- June 01, 2024 , by Maagulf
ఎన్నికల ఫలితాలను తేల్చే ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు శనివారంతో ముగియనున్నాయి. ఏడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో శనివారం ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 57 పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతాయి.

ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికల అనంతరం ప్రకటిస్తారు. ఒపీనియన్ పోల్‌ను ఎగ్జిట్ పోల్స్ పోలి ఉంటాయి. ఓటువేసి పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఓటర్లను ఎవరికి ఓటు వేశారని సర్వే చేసేవారు అడుగుతారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద సేకరించిన వివరాలను బట్టి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై ఏజెన్సీలు అంచనాలను ప్రకటిస్తాయి.

అటు సార్వత్రిక సమరం.. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. హోరాహోరీ పోరుతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. ఓటరు తీర్పుపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలేంటి? ఏ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎవరికి పట్టం కడతాయి? సర్వే సంస్థలు జనం నాడిని పట్టుకుంటాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు శనివారం రానున్నాయి.

శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 543 లోక్‌సభ స్థానాల్లో గెలిచేది ఎవరు? టీమ్‌ NDA VS టీమ్ I.N.D.I.A ఎన్ని సీట్లు సాధిస్తాయి. మోదీ హ్యాట్రిక్‌ ఖాయమేనా? అన్న ప్రశ్నలకు ఆయా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనాలను ప్రకటించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..
ఎగ్జిట్‌ పోల్స్‌పై ఏపీ పార్టీల్లో హైటెన్షన్‌ నెలకొంది. పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరికి అనుకూలంగా రానుందన్న ఆసక్తి నెలకొంది. టీడీపీ కూటమి గెలుచుకునే సీట్లు ఎన్ని? జగన్‌ లక్ష్యం నెరవేరుతుందా? పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలో ఎవరిది పైచేయి? రాయలసీమ సపోర్ట్‌ ఎవరికి? అన్న ప్రశ్నలకు కొన్ని గంటల్లోనే సమాధానం రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com