ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు

- June 02, 2024 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు

దోహా: ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలను సగానికి తగ్గించాలని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  జూన్ 1 నుండి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయని పేర్కొంది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు 50% తగ్గింపు వర్తించబడుతుందని,దేశం నుండి నిష్క్రమించే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిపై కొత్త నియమాలు మరియు విధానాలను అమలులోకి తెచ్చినందున అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. వాహనాలకు నిష్క్రమణ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. ఖతార్ పౌరులు, నివాసితులు, సందర్శకులు మరియు GCC పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై 50% తగ్గింపుకు అర్హులు. 

మూడు సంవత్సరాలకు మించని వ్యవధిలో నమోదు చేయబడిన ఉల్లంఘనలపై తగ్గింపు వర్తిస్తుంది.  మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఈ ఆఫర్ ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాల ముందస్తు చెల్లింపును ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com