ఒలింపిక్ రేసులోకి బాక్సర్ అమిత్ పంగల్ …
- June 02, 2024
ప్యారిస్: భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ విశ్వ వేదికపై తన పంచ్ వవర్ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్‌ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. తద్వారా భారత్ నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన ఐదో బాక్సర్‌గా పంగల్ రికార్డు నెలకొల్పాడు.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ క్వార్టర్స్‌లో అమిత్ రెచ్చిపోయాడు. చైనాకు చెందిన లూ చౌంగ్‌పై పంచ్‌ల వర్షం కురిపించి 5-0తో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లాడు. దాంతో, నిశాత్ దేవ్ తర్వాత ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్న రెండో పురుష బాక్సర్‌గా అమిత్ నిలిచాడు.
ప్రస్తుతానికి పంగల్‌తో కలిపి ఐదుగురు బాక్సర్లు ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించారు. నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లినా బొర్గొహన్ (75 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు), నిశాంత్ దేవ్ (71 కిలోలు), అమిత్ పంగల్(51 కేజీ) లు విశ్వ క్రీడల్లో పతకంపై గురి పెట్టారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







