కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు..
- June 03, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాకిచ్చింది. తీహార్ జైలులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరు పర్చారు. అయితే, కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ జులై 3కు వాయిదా వేసింది. మే10వ తేదీన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను సమన్లు జారీచేస్తూ మీపై అభియోగాలు మోపపడ్డాయి. ఈ కేసుపై ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి జైల్లో ఉండాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!