అలీ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి
- June 10, 2016
వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్విల్లే వీధుల గుండా సాగిన ఆయన అంతిమయాత్రను చివరిసారిగా తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. మహిళలు, వృద్ధులే కాకుండా యువకులతో పాటు చిన్నారులు కూడా ఓపిగ్గా నిరీక్షించారు. 'అలీ వియ్ లవ్ యూ..' అనే ప్లకార్డులతో మహాయోధుడికి చివరిసారిగా వీడ్కోలు పలికారు. సీతాకోక చిలుకలా విహరించు.. అనే తన నినాదానికి అనుగుణంగా కాన్వాయ్‌లోని వాహనాలకు బటర్‌ఫ్లయ్ గుర్తులను ఉంచారు. 17 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో 19 మైళ్ల పాటు యాత్ర సాగింది.1960లో ఒలింపిక్ స్వర్ణం సాధించిన అనంతరం అలీని ఘనంగా ఊరేగించిన మార్గంలోనే ఆయన చివరి యాత్రను కూడా సాగించారు.బాల్యంలో నివసించిన ఇల్లు, తొలిసారిగా బాక్సింగ్ లో ఓనమాలు నేర్చుకున్న జిమ్, మొహమ్మద్ అలీ సెంటర్, ఆఫ్రికన్ అమెరికన్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ దారిలో ఉన్నాయి. అలాగే అలీ శవపేటికను ఉంచిన వాహనం మీదికి అభిమానులు గులాబీ పూలను చల్లుతూ శ్రద్ధాంజలి ఘటించారు. దశాబ్దం క్రితమే తన చివరి క్రియల కోసం ఎంపిక చేసుకున్న కేవ్ హిల్ శ్మశానవాటికలోనే అలీ అంత్యక్రియలు జరిగాయి. ఇందులో ప్రస్తుత భార్యతో పాటు ఆయన ఇద్దరు మాజీ భార్యలు, పిల్లలు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, మాజీ హెవీవెయిట్ చాంపియన్లు లెనాక్స్ లూయిస్, మైక్ టైసన్ కూడా తమ ఆరాధ్య దైవానికి చివరిసారిగా వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









