మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం

- June 04, 2024 , by Maagulf
మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం

అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్‌ ఘన విజయం సాధించారు.

తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్‌ విజయం సాధించారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో గెలిచారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 2 సార్లు గెలిచింది.అది కూడా 1983, 1985ల్లో టీడీపీ గెలిచింది. అంతే కాకుండా ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. దీంతో టీడీపీ సైతం పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకే మంగళగిరి సీటును కేటాయిస్తూ వచ్చింది.

2019లో మంగళగిరిలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన లోకేశ్‌ వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పద్మశాలీలు టీడీపీకి ఓటేయబోమని ప్రకటించడం లోకేశ్‌కు ప్రతికూలమైంది. మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com