జోరు మొదలెట్టిన తమ్ముళ్లు.. ఆ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు
- June 04, 2024
విజయవాడలోని వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ విజయం సాధించిన కేవలం కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో… టీడీపీ ప్రభుత్వం చేసిన మొదటి పని ఇదే అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు.
టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీ పేరులోని అక్షరాలను మార్చి సంబరాలు చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీని పేరును వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి ఆ సమయంలో పెద్ద గొడవలే జరిగినప్పటికీ జగన్ మాత్రం ఆ పేరును అలానే ఉంచారు. ఆ సమయంలో టీడీపీ నుంచే కాకుండా రాష్ట్ర ప్రజల నుంచి కూడా పేరు మార్పు విషయం గురించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 2024 టీడీపీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీ పేరు మార్చడంతో టీడీపీ వర్గీయులతో పాటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..