స్కూల్ టాపర్లను సత్కరించిన ఇండియన్ స్కూల్
- June 05, 2024
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మే 30న CBSE పరీక్షల్లో విద్యార్థులు సాధించిన అత్యుత్తమ విజయాలను పురస్కరించుకుని వార్షిక అకడమిక్ అవార్డు వేడుకను నిర్వహించింది. ఇసా టౌన్ క్యాంపస్‌లోని జషన్మల్ ఆడిటోరియంలో 2023-2024 విద్యాసంవత్సరంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన X మరియు XII గ్రేడ్ల నుండి సుమారు 260 మంది అత్యుత్తమ విద్యార్థులకు పతకాలు, సర్టిఫికేట్లను అందజేసారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె జాకబ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, వైకె అల్మోయ్యద్ అండ్ సన్స్ డైరెక్టర్ హలా ఫరూక్ అల్మోయ్యద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఎంబసీ అటాచ్ (ఎడ్యుకేషన్) రాజేంద్ర కుమార్ మీనా, చైర్మన్ బిను మన్నిల్ వరుగీస్, సెక్రటరీ వి రాజపాండియన్ మరియు వైస్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ ఫైజల్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







