ఈద్ అల్ అధా: ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే జీతాలు

- June 07, 2024 , by Maagulf
ఈద్ అల్ అధా: ప్రభుత్వ ఉద్యోగులకు ముందుగానే జీతాలు

యూఏఈ: ఈద్ అల్ అదా సందర్భంగా దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ జూన్ జీతాలను చాలా ముందుగానే పొందనున్నారు. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సిబ్బందికి జూన్ 13న వేతనాలు అందజేయాలని అందులో ఆదేశించారు. ఇది ఉద్యోగులు వారి కుటుంబాలకు ఆనందాన్ని తెస్తూ పండుగ కోసం వారి అవసరాలను తీర్చగలదని పేర్కొన్నారు. 

యూఏఈ నివాసితులు ఈద్ అల్ అధా కోసం ఐదు రోజుల వరకు సెలవులు పొందనున్నారు.  చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు కనిపిస్తే ఈద్ అల్ అదా మొదటి రోజు జూన్ 16 అవుతుంది. చంద్రుడు కనిపించకపోతే, జూన్ 17న ఈద్ ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com