యూఏఈలో డెలివరీ వర్కర్ల కోసం 6,000 రెస్ట్ స్టేషన్‌లు

- June 08, 2024 , by Maagulf
యూఏఈలో డెలివరీ వర్కర్ల కోసం 6,000 రెస్ట్ స్టేషన్‌లు

యూఏఈ: ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో యూఏఈ అంతటా డెలివరీ సర్వీస్ వర్కర్ల కోసం 6,000 రెస్ట్ స్టేషన్‌లను అందించనున్నట్లు మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. 15 జూన్ నుండి  సెప్టెంబర్ 15 వరకు జరిగే మిడ్‌డే బ్రేక్ సమయంలో కార్మికులు వాటిని సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ స్టేషన్‌ల యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్ అందించనున్నారు. డెలివరీ సర్వీస్ వర్కర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగం అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అనేక రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు, రిటైల్ దుకాణాలు మరియు క్లౌడ్ కిచెన్‌లు డెలివరీ సర్వీస్ డ్రైవర్‌ల కోసం విశ్రాంతి ప్రాంతాలను కూడా అందిస్తాయని పేర్కొన్నారు.  

గత సంవత్సరం డెలివరీ కార్మికుల కోసం 365 విశ్రాంతి స్టేషన్‌లను అందించామని, ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు మధ్యాహ్న వరకు ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. మిడ్‌డే బ్రేక్‌లో కార్మికులను రక్షించడానికి పారాసోల్‌లు, షేడెడ్ ప్రాంతాలను అందించడం, తగిన శీతలీకరణ పరికరాలు, తగినంత చల్లని తాగునీరు, లవణాలు వంటి హైడ్రేటింగ్ పదార్థాలు, ఇతర సౌకర్యాలు మరియు జాబ్ సైట్‌లలో ప్రథమ చికిత్స పరికరాలను అందించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తన కాల్ సెంటర్ 600590000, స్మార్ట్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్ ద్వారా ఏదైనా మిడ్‌డే బ్రేక్ ఉల్లంఘనలను తెలపాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com