చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు..

- June 08, 2024 , by Maagulf
చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేయబోతున్నారు. అయితే, చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం.. తొలుత జూన్ 12న చంద్రబాబు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం చేస్తారని టీడీపీ తెలిపింది. కానీ, కొన్ని కారణాల రీత్యా చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయం ఉదయం 9.27 గంటలకు మారింది.

ఈ మేరకు ఏపీ సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగుతుందని సీఎంఓ ట్వీట్ చేసింది. అంతేకాదు.. ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక, ముహుర్తాన్ని కూడా సీఎంఓ ప్రకటించింది.

దీనికి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఐదుగురు సీనియర్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఎ.బాబు, హరిజవహర్ లాల్, కన్నబాబు, హరికిరణ్, వీర పాండ్యన్ ను నియమించింది. జేఏడీ పొలిటికల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ ఐదుగురు అధికారులు చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com