నోల్ కార్డును మర్చిపోయారా? 6 దశల్లో డిజిటైజ్
- June 09, 2024
దుబాయ్: మీరు తరచూ నోల్ కార్డు మర్చిపోతున్నారా? ఇకపై ఆ సమస్యలకు బైబై చెప్పండి. మీరు Samsung ఫోన్‌ని కలిగి ఉన్నట్లయితే, మీరు మీ కార్డ్‌ని డిజిటలైజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారా చెల్లింపులను చేయవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) మరియు శాంసంగ్ గల్ఫ్ ఎలక్ట్రానిక్స్ మధ్య ఒప్పందం కుదిరింది.
6 స్టేప్పుల్లో డిజిటలైజ్
1. ముందుగా మీరు నోల్ పే యాప్‌ని డౌన్ లోడ్ చేయాలి.
2. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యూఏఈ పాస్ తో లాగిన్ కావాలి.
3. 'గెట్ మై నోల్ కార్డ్'పై ట్యాప్ చేయాలి.
4. మీ నోల్ కార్డ్‌ని డిజిటలైజ్ చేసే ప్రక్రియను అనుసరించాలి.
5. మీ నోల్ కార్డ్‌ని మీ ఫోన్ వెనుక భాగంలో పట్టుకోని డైరెక్షన్స్ ఫాలో కావాలి.
6. మొత్తం ప్రక్రియ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. దీంతో మీ నోల్ కార్డ్ డిజిటలైజ్ అవుతుంది.
నోట్: ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ ఫిజికల్ కార్డ్ చెల్లుబాటు కాదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..