ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు
- June 09, 2024
కువైట్ సిటీ: మే 13న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అలాగే బిజేపి ఘనవిజయం సాధించిన సందర్భంగా కువైట్ లో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కువైట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఫర్వానియా ద్వైహి పాలస్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ ఇంత ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసారు. ఇప్పటి వరకు ఎన్నారైలు అందరు సోషల్ మీడియాలో ఒక సైకో విద్వంస పాలనకు వ్యతిరేకంగా పోరాడాము. ఈ విజయం తరువాత మనమీద మరింత భాద్యత పెరిగింది అని, కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాటిని ప్రజలకు తెలియ చేసే భాద్యత మన ఎన్నారై లమీద వుందని పేర్కొన్నారు. ఈ కార్యకమంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, ఎన్నారై టిడిపి కువైట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు, సుంకవల్లి సత్య సాయి బాబా, కట్టా వేణు గోపాల్ స్వామి, సాయి కృష్ణ,కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బా రెడ్డి, విసి సుబ్బారెడ్డి, ఈడుపుగంటి దుర్గాప్రసాద్,పిడికిటి శ్రీనివాస్ చౌదరి, చిన్నా రాజు, వంశీ కాపెర్ల, నరేష్, పెంచల్ సన్నపనేని, పెంచల్ రెడ్డి, మద్దిపట్ల శివ, పోలారపు బాబు నాయుడు, శ్రీనివాస్, మరియు జనసేన గల్ఫ్ కన్వీనర్స్ కాంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్. కువైట్ కో-ఆర్డినేటర్స్ బిరడా సూర్యనారాయణ, ఆకుల రాజేష్, ఇమ్మిడిసెట్టి సూర్యనారాయణ, జిలకర్ర మురళీ, దండు వేణు, మొదలగు వారు, అలాగే మహాసేన రాజేష్ రాపాక, బాలకృష్ణ పాల్గొన్నారు. చివరిగా భారీ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. వచ్చిన అతిదులకు పసందైన విందును ఎర్పాటు చేశారు. కార్యక్రమం లో పాల్గొన్న అందరికి ఈశ్వర్ నాయుడు ధన్యవాదాలు తెలియజేసారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)




తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







